Friday 1 June 2012

అమ్మాయిలను ఆకర్షించేదెలా?

అమ్మాయిలను ఆకర్షించడానికి కుర్రాళ్లు చేయని సర్కస్ లేదు. అందమైన అమ్మాయి రోడ్‌లో కనబడితే రై.. రై.... మంటూ బైక్‌లో దూసుకెళుతూ చక్కర్లు కొడుతుంటారు. అబ్బాయి అమ్మాయి వెంట పడీ పడీ అలసిపోయి, అవమానాలు, సత్కారాలు, తిట్లు, చెప్పుకుంటే ఎన్నెన్నో.... అమ్మాయితో పరిచయం పెంచుకోవడానిక అన్ని అవస్థలు పడుతుంటారు, కానీ అమ్మాయిని నుంచి రెస్పాన్స్ ఉండదు. అసలు అమ్మాయిని ఆకర్షించడం ఎలా?

1.) స్మైల్: ఒక అమ్మాయితో మాట్లాడేటప్పుడు నవ్వుతూ మాట్లాడాలి, ఇది మీలోని అత్మవిశ్వాసాన్ని చూపుతుంది. అదే చిరునవ్వు ఇతరులను రిలాక్స్ అవ్వడానికి కారణమౌతుంది. అలాగే మీ నవ్వుకు కాస్త సరదా మాటలను కలపండి. తను మీతో చనువును పేరిగే దాక అలాగే కొనసాగించాలి.

2.) డ్రస్సింగ్: మీరు ధరించే దుస్తులుపై అమ్మాయిలు ఖచ్చితమైన అంచనాలు వేస్తారు, కనుక జాగ్రత్తగా దుస్తులను ఎంచుకోవాలి. క్రొత్త మోడళ్లను ట్రై చేస్తుండాలి.

3.) ఫిట్‌నెస్: ఫిట్ మరియు హెల్తీగా ఉంటే సులభంగా అమ్మాయిల దృష్టిని ఆకర్షించవచ్చు. మీరు అథ్లెట్ కాకపోయిన మీకు వర్కవుట్ చేయడం ఇష్టం లేకున్నా, మీ నడిచే స్టయిల్, నిలబడే తీరు, ఇంకా మీ బుజాలు అవి ముందుకు వాలిపోయివుంటే వెనుకకు సరిచేసుకోండి, అలాగని మీ బుజాలను బిగుసుకున్నట్టు ఉంచుకోకూడదు. మీరు రిలాక్స్‌గా ఉన్నట్లు అమ్మాయి దృష్టిలో భావించేలా నడుచుకోవాలి.

పరాయి స్త్రీలతో వివాహేతర సంబంధం మంచిదా?

నేటి సమాజంలో ముఖ్యంగా హైక్లాస్ సొసైటీలో పరాయి స్త్రీలతో వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం ఓ ఫ్యాషన్‌గా మారిపోయింది. తమకు భార్యలు ఉన్నప్పటికీ... ఇతర మహిళలతో ఇంటి బయట సెక్స్‌ మజాను ఆస్వాదించేందుకు పురుష పుంగవులు అమితాసక్తిని చూపుతున్నారు.

అయితే, ఈ తరహా వివాహేతర సంబంధం మంచిదా లేదా చెడుదా అంటే పెక్కుమంది మంచి పద్దతి కాదని సమాధానమిస్తుంటారు. ముఖ్యంగా... వివాహ ఘట్టం ఎంత ప్రాచీనమైందో, జీవిత భాగస్వామి పట్ల ద్రోహం చేయటం కూడా అంతే ప్రాచీనమైందనే భావన కొంతమందిలో నేటికి ఉన్నారు.

వివాహేతర సంబంధాలపై ఓ వెబ్‌సైట్ నిర్వహించిన సర్వేలో 41 శాతం మంది భాగస్వాములు లైంగిక జీవనంలో పరాయి స్త్రీతో సంబంధం కలిగి ఉండటం లేదా తన భాగస్వామిని మోసం చేయటం అతి సాధారణంగా జరుగుతున్న చర్యగా పేర్కొన్నారట.

చాలామంది... అసలు ఓసారి మరొకరితో ఆ మజా ఆస్వాదిస్తే చూస్తే ఎలా ఉంటుందనేందుకు కూడా వివాహేతర సంబంధం పెట్టుకుంటున్నట్టు తెలిపారు. తమ వివాహ జీవితంలో బాధ్యతలన్నీ బాగా నిర్వహిస్తున్నపుడు ఒకసారి బయటి సంబంధం రుచి చూస్తే తప్పేంటని వారు ప్రశ్నిస్తున్నారు.

ఇలాంటి వారు పార్టీల్లో మజాలు, పీకల్లోతుకు తాగేయటం, పక్కలో పడుకునేవారెవరో కూడా పట్టించుకోకపోవడం. అదేంటమ్మడూ ...అంటే, నేను నా భర్తను ఇప్పటికి మనసారా ప్రేమిస్తూనే వున్నా... ఏదో బోర్ కొట్టేసి జస్ట్ ఫర్ ఛేంజ్ అక్కడ సెటప్ చేశా....? అంటున్నారట.

అయితే, ఈ వివాహేతర సంబంధాలు పెరిగి పోవడానికి ప్రధానంగా ఆధునిక టీవీలు, పురుషులు, స్త్రీల మధ్య సన్నిహిత్వం పెరిగిపోవటం, వంటివి, ఏడేళ్ళు గడిచే సరికి బోర్ కొట్టేయటం మరో భాగస్వామితో సంబంధం పెట్టుకోవడం వంటివి జరిగిపోతున్నాయి.

ఒకటే పని.. రాత్రిళ్లు నిద్రపట్టడం లేదా..? చందనపు నూనెతో మర్దనం చేస్కోండి..!!

ప్రస్తుత జీవితం ఉరుకుల పరుగులమయం అయిపోయింది. దీంతో చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. శారీరక లేదా మానసికపరమైన ఒత్తిడే దీనికంతటికి కారణం అంటున్నారు వైద్యులు. నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటే శరీరానికి సుగంధ భరితమైన తైలాలనుపయోగించి మీ శరీరానికి మాలిష్ చేస్తే సుఖవంతమైన నిద్ర సొంతమంటున్నారు.
ముప్పై మిల్లీగ్రాముల బేస్ నూనెలో ఐదు చుక్కల కైమోమైల్ నూనె, ఐదు చుక్కల మెజోరమ్ నూనె, పదిహేను చుక్కల చందనపు నూనె మరియు ఐదు చుక్కల క్లైరీసెజ్ నూనెను కలుపుకుని మాలిష్ చేయండి. దీంతో శరీరానికి, మనసుకు కొత్త శక్తి వచ్చి ఉపశమనం కలుగుతుందంటున్నారు వైద్యులు.
మాలిష్ చేసుకునేటప్పుడు మీ శరీరపు వెనుక వీపు భాగం, మెడ, భుజాలను పూర్తిగా మాలిష్ చేయాలి. అలాగే వేడి నీటితో స్నానం చేసేటట్లయితే తగినంత వేడి ఉండేలా చూసుకోండి. మరీ చల్లగానూ, మరీ వేడిగాను ఉండకుండా ఉండేలా చూసుకోండి.
శరీరానికి కావలసిన వేడి మాత్రమే మీరు శరీరానికి నీటిద్వారా అందివ్వాలి. ఒక్కొక్కరి శరీర తత్వం ఒక్కోలా ఉంటుంది. మీరు ఏదైనా చికిత్సను ప్రారంభించదలచుకునే ముందు వైద్యుల సలహాలను పాటించండి.