Sunday 1 July 2012

20 రోజులపాటు కారులోనే యువతిపై ఐదుగురు కుర్రాళ్ల గ్యాంగ్ రేప్

అమ్మాయిలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. రాజస్థాన్‌లో చోటుచేసుకున్న ఘటనను చూస్తే అమ్మాయిలపై జరుగుతున్న అకృత్యాలు ఏ స్థాయిలో ఉంటున్నాయో అర్థమవుతుంది. 

వివరాల్లోకి వెళితే... 16 ఏళ్ల యువతి ఇంటర్ పరీక్షలు ముగించుకుని శెలవుల్లో వాళ్ల పిన్ని వద్దకు వెళ్లేందుకు బయలుదేరింది. ఐతే ఆమెను మార్గమధ్యంలోనే ఐదుగురు యువకులు బలవంతంగా బొలెరో వాహనంలో ఎక్కించుకుని సమీపంలోని అడవిలోనికి తీసుకెళ్లారు. కారులోనే అమ్మాయిని బంధించి ఐదుగురు 20 రోజులపాటు మూకుమ్మడిగా అత్యాచారం జరిపారు. 

ఆ అమ్మాయికి తిండీతిప్పలన్నీ కారులోనే ఏర్పాటు చేసి ఆమెను కారు నుంచి బయటకెళ్లకుండా ప్లాన్ చేశారు. 20 రోజుల తర్వాత ఎలాగోలా తప్పించుకున్న అమ్మాయి పోలీసుల ద్వారా ఇంటికి చేరింది. విషయాన్నంతా తల్లిదండ్రులకు చెప్పడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల్లో ముగ్గురు యువకులు తన సొంత గ్రామానికి చెందిన వారేననీ, ఇద్దరు వ్యక్తులు మాత్రం ఎవరో తనకు తెలియదని అమ్మాయి పోలీసులకు చెప్పింది.

No comments:

Post a Comment