Sunday 1 July 2012

హస్త ప్రయోగం చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి?

చాలా మంది యువకులకు హస్త ప్రయోగం అలవాటు ఎక్కువగా ఉంటుంది. స్వయంతృప్తి పొందకుండా ఒక్కరోజు కూడా ఉండలేరు. కొందరు రోజుకు మూడు నాలుగు సార్లు కూడా హస్త ప్రయోగం చేస్తుంటారు. అయితే, దీన్ని రోజూ చేయడం వల్ల లేనిపోని సమస్యలు ఏమైనా వస్తాయన్న ఆందోళనా వారిలో ఉంటుంది. అయితే, రోజుకు మూడు నాలుగు సార్లు చేయడం వల్ల ఇంకా చిక్కిపోతానా అనే సందేహం వారిని వెంటాడుతూ ఉంటుంది. ఇలాంటి వారు హస్త ప్రయోగం చేయకుండా ఉండాలంటే ఏం చేయాలన్న అంశంపై సెక్స్ వైద్యులను సంప్రదిస్తే కింది విధంగా చెపుతున్నారు. 

సాధారణంగా యుక్త వయస్సులో శృంగార హార్మోన్ల వలన కోర్కెలు బాగా ఉంటాయన్నారు. ఇది కేవలం కొందరిలోనే కాకుండా... అనేక స్త్రీపురుషుల్లోనూ ఉంటాయట. టీనేజ్‌ వయసులో వచ్చే సహజసిద్ధమైన మనో శారీరక స్థితిగా దీన్ని పేర్కొంటున్నారు. 

అయితే, హస్తప్రయోగం వలన ఏ మాత్రం నీరసంగానీ, ఇతర లైంగిక సమస్యలుగానీ రావు. కాకపోతే రోజుకు అన్ని సార్లు చేయడం వలన ఒక రకమైన ఆందోళన, అస్థిరత్వం ఏర్పడతాయని వైద్యులు చెపుతున్నారు. అలాగే, చదువుకోకుండా, ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉండే చాలామంది యువకులు ఇంటర్‌నెట్‌లో అశ్లీల సైట్స్‌ చూస్తూ విపరీతమైన హస్తప్రయోగానికి పాల్పడుతుంటారని చెపుతుంటారు. 

ఇలా చేయడం వల్ల తమలోని లైంగిక సామర్థ్యం తగ్గిపోతుందే మోనని బాధపడుతుంటారు. హస్తప్రయోగం వలన పెళ్లయ్యాక ఎటువంటి సమస్యలూ రావంటున్నారు. కొన్ని ప్రత్యేకమైన కేసుల్లో దీనిని ఒక చికిత్సా పద్ధతిగా కూడా చేయవచ్చని కోరుతున్నారు. 

పైగా... రోజుకు ఒకసారి చేసే హస్త ప్రయోగం చేసుకోవడం వల్ల ఎలాంటి సమస్యా రాదని చెపుతున్నారు. కాకపోతే అదే పనిగా దాని గురించి ఆలోచిస్తూ ఎక్కువసార్లు చేయడం వలన మానసికంగా అది మనలను కుంగిపోయేలా చేస్తుంది.

No comments:

Post a Comment