Sunday 1 July 2012

రతిలో బాగానే తృప్తి పొందుతున్నా.. కానీ గర్భవతిని కాలేదు!!

సాధారణంగా అనేక మంది మహిళలకు వివాహమై సంవత్సరాలు గడుస్తున్నా తల్లికాలేదన్న బెంగ ఉంటుంది. దాంపత్య జీవితంలో బాగా ఎంజాయ్ చేస్తున్నప్పటికీ.. గర్భం ఎందుకు రావడం లేదబ్బా అనే ఫీలింగ్ వారిని వెంటాడుతూనే ఉంటుంది. తల్లికావాలన్న తపనతో కొన్ని సందర్భాల్లో టెస్ట్ ట్యూబ్ బేబీలపై కూడా మొగ్గు చూపుతుంటారు. 

ఇలాంటి సమస్యలపై సెక్స్‌, గైనకాలజిస్టులతో సంప్రదిస్తే... గర్భం దాల్చేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సలహాలు సూచనలు చేస్తున్నారు. నెలసరి 12-16 రోజుల మధ్యలో అండం విడుదల అవుతుందని, ఆ రోజుల్లో సెక్స్‌లో పాల్గొంటే కలిస్తే గర్భం వచ్చే అవకాశముందని చెపుతున్నారు. 

అలాగే మహిళలు గర్భాశయం ఎలావుందో స్కానింగ్‌ ముందుగా పరీక్ష చేయించుకోవడం మంచిదని సలహా ఇస్తున్నారు. అదేవిధంగా భర్త వీర్యాన్ని కూడా టెస్ట్ చేయడం మంచిదని సూచన చేస్తున్నారు. కేవలం అండం విడుదల అయ్యే రోజుల్లో మాత్రమే కాకుండా... వీలైనన్నిసార్లు టెన్షన్‌ లేకుండా, కేవలం పిల్లల కోసమే సెక్స్‌లో పాల్గొనాలన్న భావన లేకుండా ప్రశాంతంగా శృంగార కార్యక్రమంలో పాల్గొంటూ.. ఎలాంటి మానసిక ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా గడపాలని వారు సలహా ఇస్తున్నారు.

No comments:

Post a Comment